Home » East Godavari
చేతివృత్తి పనులు చేసుకునే వారంతా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేతి వృత్తుల సేవా సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా.. అలాగే ఉన్నతాధికారులు తలచుకుంటే సంవత్సరాల కిందట జరిగిన అవకతవలకలనైనా విచారణ చేపట్టి సంబందిత అధికారులపై చర్యలు చేపట్టవచ్చు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేష్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద నీరు నిల్వ ఉన్న గోతుల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నల్లజర్ల మండలం పోతవరం వద్దకు చేరుకుంది.
అల్లూరి జిల్లా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధిని రామకృష్ణ సందర్శించనున్నారు.
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన టీడీపీ చీఫ్.. సర్పంచులతో సమావేశం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకే చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గోకవరం నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అల్లూరి జిల్లా: పాడేరు ఐటిడిఏ ఎదుట అంగన్వాడి ‘గిరిపోషణ’ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడి గిరిపోషణ కార్యకర్తలకు 17 నెలలుగా బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.