Nara lokesh: ఏపీలో రోడ్ల దుస్థితిపై లోకేశ్ వినూత్న నిరసన
ABN , First Publish Date - 2023-09-01T15:36:43+05:30 IST
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేష్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద నీరు నిల్వ ఉన్న గోతుల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు.
తూర్పుగోదావరి: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP leader Nara Lokesh) వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద నీరు నిల్వ ఉన్న గోతుల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు. దివాలాకోరు ముఖ్యమంత్రి ముఖం చూసి రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదివరకెన్నడూ లేని విధంగా 25 వేల కి.మీ.ల సిమెంటు రోడ్లు వేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం రోడ్లపై తట్టిమట్టి పోసే దిక్కులేకుండా పోయిందన్నారు. రోడ్లకోసం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చిన నిధులను కూడా జగన్ దారి మళ్లించారని లోకేశ్ ఆరోపించారు.