మనవడిని కొడుతున్నాడని అడ్డు వెళితే..

ABN , First Publish Date - 2023-08-16T09:41:41+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకే చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మనవడిని కొడుతున్నాడని అడ్డు వెళితే..

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకే చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మనువడని కొడుతున్నాడని అడ్డు వెళ్లిన తండ్రి యాళ్ల పాటియ్య (58)ని చెక్కపీటతో కొడుకు కొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో ఆ తండ్రి మరణించాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాటియ్య మృతి చెందాడు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-16T09:41:41+05:30 IST