Home » East Godavari
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరి మృతి, 25మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు.
ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అనపర్తి ఆంజనేయనగర్‌లో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి(Satthi Suryanarayana Reddy) రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy)తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించటంతో ఐదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.
AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామ ప్రజలు హడలిపోయారు. ఊహించని ఘటనతో బెంబేలెత్తిపోయారు. అంతంత మాత్రమే నీళ్లు వచ్చే బోరు బావి నుంచి ఒక్కసారిగా 15 మీటర్ల మేర నీళ్లు ఎగసిపడ్డాయి.
రాజమహేంద్రవరం(Rajamahendravaram) శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్(Railway Flyover) పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.