Share News

Andhra Pradesh: బోరు బావిలోంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ నీరు.. అది జనాలు హడల్..!

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:04 PM

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామ ప్రజలు హడలిపోయారు. ఊహించని ఘటనతో బెంబేలెత్తిపోయారు. అంతంత మాత్రమే నీళ్లు వచ్చే బోరు బావి నుంచి ఒక్కసారిగా 15 మీటర్ల మేర నీళ్లు ఎగసిపడ్డాయి.

Andhra Pradesh: బోరు బావిలోంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ నీరు.. అది జనాలు హడల్..!
Borewell (File Photo)

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామ ప్రజలు హడలిపోయారు. ఊహించని ఘటనతో బెంబేలెత్తిపోయారు. అంతంత మాత్రమే నీళ్లు వచ్చే బోరు బావి నుంచి ఒక్కసారిగా 15 మీటర్ల మేర నీళ్లు ఎగసిపడ్డాయి. అది చూసిన గ్రామస్తులు భయంతో వణికి పోయారు. ఏంటా పరిశీలించగా.. బోరు బావి నుంచి గ్యాస్‌ లీకైంది. అలా గ్యాస్‌తో పాటు నీరు కూడా పైకి ఎగజిమ్మింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కడలి గ్రామ శివారులో విజయేంద్ర వర్మ ఆక్వా చెరువుల వద్ద బోరు బావి నుంచి ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. నీటితో పాటు గ్యాస్ కూడా వచ్చింది. గతంలో ఎప్పుడో వేసిన బోరు బావి నుంచి ఏకంగా 15 మీటర్ల మేరకు పైకి నీరు ఎగజిమ్మింది. నీళ్లు భారీ స్థాయిలో బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు.. బావి నుంచి వచ్చింది గ్యాస్ కాదని నిర్ధారించారు. అనంతరం ఆ భావిని మూసివేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 15 , 2024 | 05:04 PM