Minister Subhash: ఎన్నికల్లో ఓడిపోయినా జగన్‌కు జ్ఞానోదయం కాలేదు: మంత్రి వాసంశెట్టి
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:01 PM
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయేంటని జగన్ మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
జగన్ పరిపాలన ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని, కానీ జగన్ మాత్రం 99శాతం హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాశ్ ధీమా వ్యక్తం చేశారు.