Home » Election Results
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరుతాయని తెలిపారు.
రానున్న కొన్ని రోజుల్లో దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకు ముందు నుంచే ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం - ఈసీ ( Election Commission ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ పార్టీలనకు కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. ఓట్ల ప్రచారం సమయంలో వ్యవహరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు.
రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
రాజ్యసభ ఎన్నికలకు ముందే సమాజ్ వాదీ పార్టీకి సోమవారం రాత్రి గట్టి దెబ్బ తగిలింది. వాస్తవానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. కానీ ఈ విందుకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(donald Trump) నిర్ణయాత్మక విజయం సాధించారు. అతను తన సొంత రాష్ట్రంలో ప్రత్యర్థి నిక్కీ హేలీని ఓడించిన నేపథ్యంలో వైట్ హౌస్ పోటీలో జో బైడెన్కు గట్టి పోటీ ఇవ్వనున్నారు.