Tamil Nadu: పార్టీ చెబితే ఎన్నికల్లో పోటీ చేస్తా.. తమిళనాడు బీజేపీ చీఫ్ వెల్లడి
ABN , Publish Date - Mar 02 , 2024 | 09:20 AM
తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు. ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారన్న ఊహాగానాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. బీజేపీలో వ్యక్తిగత పక్షపాతం లేదని ప్రజలందరి కోసం పార్టీ పని చేస్తోందని తెలిపారు. పార్టీ ఏది చెప్పినా అది పాటించడం తమ బాధ్యత అని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం తన శక్తిమేరకు పని చేస్తానని అన్నామలై స్పష్టం చేశారు.
మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. నటనలో విఫలమై రాజకీయాల్లోకి వచ్చారు అని ఎద్దేవా చేశారు. ఆయన తాత దివంగత ఎం.కరుణానిధి, తండ్రి ( స్టాలిన్) ఏనాడైనా పేదలకు సహాయం చేశారా? అని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా చైనీస్ భాషలో టీఎన్ బీజేపీ శుభాకాంక్షలు చెప్పడంపై అడిగిన ప్రశ్నకు అన్నామలై బదులిస్తూ ఇందులో తనకు అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని చెప్పడం గమనార్హం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.