RS Praveen: బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్.. పోటీ అక్కడి నుంచేనా..!!
ABN , Publish Date - Mar 18 , 2024 | 06:39 PM
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ( BRS ) పరిస్థితి మరింత కష్టతరంగా మారింది. సీనియర్ నేతలు పార్టీ మారడం, పార్టీ మారతారన్న ఊహాగానాల మధ్య నేడు కీలక ఘట్టం నెలకొంది. బీఎస్పీకి రాజీనామాచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ పోటీ చేయనున్నారు.
తెలంగాణలో తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా బీఎస్పీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ప్రవీణ్ కుమార్. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని ఇదే తాను నమ్మిన ధర్మం అని అన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. బహుజనుల అభివృద్ధి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.