Home » Electoral Bonds
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపాలించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య 'క్విడ్ ప్రో కో' జరిగిందంటూ వచ్చిన ఆరోపణలో సిట్ దర్యాప్తు జరిపించాలని రెండు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) పథకం అతి పెద్ద దోపిడీగా అభివర్ణించడాన్ని షా తప్పుబట్టారు.
లోక్ సభ ఎన్నికలు -2024 ( Lok Sabha Elections - 2024 ) కు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన 'ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్'పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఏఎన్ఐ' వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సూటిగా సమాధానమిచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తు్న్నాయని విమర్శించారు.
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను ఒక ''మంచి ఉద్దేశం''తోనే 2017లో కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టినట్టు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. నిధులు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదని చెప్పారు. ఈ స్కీమ్ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఈసీకి(EC) అందజేసింది. సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది.
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో పాటు.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవ లంభిస్తోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు.
ఎలక్టోరల్ బాండ్లను అతిపెద్ద దోపిడీ రాకెట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. గాంధీకి కూడా రూ.1,600 కోట్లు వచ్చాయనీ, ఆ 'హఫ్తా వసూలీ' ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన వివరించాలని అన్నారు.
ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించి తీరాల్సిందేనని.. ఎంపిక చేసిన అరకొర సమాచారం ఇస్తే కుదరదని తేల్చిచెప్పింది. ఈసారి ఇచ్చే వివరాల్లో.. బాండ్లను కొన్నవారికి, వాటిని