Congress: ఎన్నికల బాండ్లలో పట్టుబడినందుకే ఇంటర్వ్యూలు.. ప్రధాని పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:22 PM
లోక్ సభ ఎన్నికలు -2024 ( Lok Sabha Elections - 2024 ) కు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
లోక్ సభ ఎన్నికలు -2024 ( Lok Sabha Elections - 2024 ) కు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పట్టుబడినందుకే ప్రధాని ఇంటర్వ్యూలు ఇస్తున్నారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఎలక్టోరల్ బాండ్‌లలో పేరు, తేదీ తప్పనిసరిగా ఉంటాయని, వాటి ఆధారంగా ఎప్పుడు బాండ్ ఇచ్చారో తెలుసుకోవచ్చని అన్నారు. ముందుగా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకున్నాక నేతలు డబ్బులు సంపాదిస్తారని విమర్శించారు. ఆ తర్వాత చర్యలు ఆగిపోతాయని వెల్లడించారు.
Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..
ఎన్నికల్లో నల్లధనం వినియోగంపై చాలా కాలంగా చర్చ జరుగుతోందని ఎన్నికల్లో ఖర్చును ఎవరూ కాదనలేరని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అన్ని పార్టీలు ఎన్నికల విరాళాలు తీసుకుంటాయని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఎలక్టోరల్ బాండ్ల విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బ్లాక్ మనీని నిర్మూలించేందుకు పెద్ద నోట్లను నిషేధించామని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల విరాళాలకు సుప్రీంకోర్టు రూ.20వేలు పరిమితి విధించిందని గుర్తు చేశారు.
Health: అధికంగా వ్యాయామం చేయడమూ ముప్పే.. షాకింగ్ విషయాలు మీకోసం..
లోక్‌సభ ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్ బాండ్లు వ్యతిరేకమని పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు, ఆ బాండ్ల విలువ, వాటిని స్వీకరించిన వారి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.