Share News

SBI: ఎలక్టోరల్ బాండ్ల వివాదం.. సీరియల్ నంబర్‌లతో సహా ఈసీకి అప్పగించిన ఎస్బీఐ

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:02 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఈసీకి(EC) అందజేసింది. సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది.

SBI: ఎలక్టోరల్ బాండ్ల వివాదం.. సీరియల్ నంబర్‌లతో సహా ఈసీకి అప్పగించిన ఎస్బీఐ

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఈసీకి(EC) అందజేసింది. సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది. ఈ నంబర్లు బాండ్లను ఉపయోగించుకున్న పార్టీల వివరాలతో క్రాస్ చెక్ చేసేందుకు సహాయపడనున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందే ఈ వివరాలను ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్‌లో వీటిని అప్‌లోడ్ చేయనున్నారు.

తద్వారా ప్రతి ఒక్కరికి వివరాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎస్బీఐ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం విధించిన తరువాత పార్టీలకు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు, పార్టీల వివరాలన్నింటినీ సమర్పించాలని ఎస్బీఐని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సమాచార సమర్పణలో ఎస్బీఐ తాత్సారం వల్ల కోర్టు.. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


తాము ఇచ్చిన గడువులోగా పూర్తి సమాచారంతో రావాలని తేల్చేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల డేటాను మార్చి 21లోగా అందజేయాలని, ఆల్ఫా న్యూమరిక్ నంబర్లతో సహా పూర్తి వివరాలను వెల్లడించి.. సమాచారాన్ని ఈసీ తమ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయాలని ఆదేశించింది.

దీంతో ఎస్బీఐ ఇవాళ పూర్తి వివరాలతో కోర్టు ముందుకు వచ్చింది. ఏ దాత, ఏ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసేదే యునిక్ బాండ్ నంబర్ విధానం. ఈ వివరాలు సమర్పించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా ఇవాళ ఎస్బీఐ చర్యలు తీసుకుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 06:03 PM