Home » Eluru
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి...
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 2,88,191 క్యూసెక్కులు గా ఉంది. కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు ఏడు అడుగుల మేర, 40 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి ...
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.
నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ కేటుగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బు పంపించింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు.
జిల్లాలోని వేలేరుపాడు మండలం అల్లూరి నగర్- మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.