YCP vs TDP: ఏలూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. అసలు ఏమైందంటే
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:34 AM
YCP vs TDP: ఏలూరు జిల్లాలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల వారిని శాంతపరిచారు.

ఏలూరు: ఏలూరు జిల్లాలోని వట్లూరులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వివాదం రాజుకుంది. ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో తన వాహనాన్ని అబ్బయ్య చౌదరి డ్రైవర్ నిలిపారు. తన కారును వెళ్లనివ్వకుండా వైసీపీ నేత కారు అడ్డంగా పెట్టారని చింతమనేని ఆరోపించారు. వైసీపీ నేత డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి చింతమనేని వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత ఫంక్షన్ హాల్ వద్దకు ఇరువర్గాల్లోని నేతలు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రాకతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ వివాదంపై చింతమనేని ప్రభాకర్ స్పందించారు. తన కారును వెళ్లనివ్వకుండా వైసీపీ నేతలు కారు అడ్డుపెట్టారని చెప్పారు. తాము అయిదుగురు ఉంటే, వారు 25 మంది ఉన్నారని తెలిపారు. తనతో కావాలని వైసీపీ నేతలు గొడవ పెట్టుకోవాలని చూశారని మండిపడ్డారు. తాము శాంతంగా ఉన్నాం.. తన గన్‌మేన్‌ను పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు..
ఏలూరు త్రీ టౌన్ స్టేషన్‌లో చింతమనేని డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారంటూ ఫిర్యాదులో డ్రైవర్ సుధీర్ పేర్కొన్నారు. ఇనుప రాడ్‌తో చింతమనేనితో సహా తనపైనా, గన్‌మేన్‌పై వైసీపీ అల్లరి మూకల దాడి చేశాయని తెలిపారు. దాడిలో స్వయంగా దెందులూరు వైసీపీ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది అల్లరి మూకలు పాల్గొన్నాయని సుధీర్ వివరించారు. అయితే డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఉన్నతాధికారుల సూచనతో, వివాదం పూర్వాపరాలు పలిశీలించి సెక్షన్లు నమోదు చేస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News