Share News

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:27 AM

ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

  • ఏలూరు జిల్లాలో దారుణం.. పోలీసులచొరవతో పిల్లలకు చికిత్స

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తల్లి స్థానాన్ని కూడా మరచిపోయింది. ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లగా, వారు పిల్లలను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలివీ.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారదకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి రాహుల్‌, రేణుక ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విభేదించి తాడిచర్లకు చెందిన ప్రియుడు నల్లవెలుగుల పవన్‌తో కలిసి ఆమె జంగారెడ్డిగూడెం పట్టణంలో సహజీవనం చేస్తోంది. శనివారం రాత్రి తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ రాహుల్‌ను ఆమె ప్రియుడు పవన్‌ వైర్‌తో వీపుపై తీవ్రంగా కొట్టాడు. రాహుల్‌ భయంతో బయటికి పరుగులు తీయగా స్థానికులు గమనించి శారద, పవన్‌లకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పవన్‌, శారదలు పిల్లలలిద్దరినీ కొడుతూ, గాయాలపై కారంచల్లి, తమ నోట్లో పచ్చిమిరపకాయ పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని బాధిత బాలుడు రాహుల్‌ తెలిపాడు. ఆదివారం ఈ సమాచారం కలెక్టర్‌ వెట్రిసెల్వి దృష్టికి వెళ్లడంతో, ఆమె ఈ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:27 AM