Home » Eluru
ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీ(BJP)లో అసంతృప్తి రగులుతోంది. బీజేపీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి సీటివ్వాలంటూ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్లో గత కొన్నేళ్లుగా బీజేపీని గారపాటి సీతారామాంజనేయ చౌదరి బలోపేతం చేశారు. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో వివాదం రాజుకుంది.
Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు. అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు. అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు, ప్లాస్కోల పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురి చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు.
Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
Andhrapradesh: సోషల్ మీడియా పోస్టింగ్స్ ధాటికి తట్టుకోలేక విసుకు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ(YSRCP) కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ(TDP) నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తోంది. అధికారంలో ఉన్నామని తాము ఏం చేసినా చెల్లుతుందని జగన్ పార్టీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు.
జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం వాడి వేడిగా జరిగింది. పట్టణంలో ఉన్న పలు సమస్యలపై మున్సిపల్ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు.
Andhrapradesh: ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో అధికారుల అలసత్వం కారణంగా స్వామివారి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది.
Andhrapradesh: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.
Andhrapradesh: మహాత్మాగాంధీ వర్ధంతి రోజున అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన ధర్నాకు దిగారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 1, 2 పనులు పూర్తి చేయాలంటూ నూజివీడులో రైతులు, రైతు సంఘ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.