Maha shivratri: వేకువజామునే శివాలయాలకు భక్తులు...
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:42 AM
Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్‌లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి, మార్చి 8: మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్‌లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆచంటలో శివరాత్రి పురస్కరించుకుని రామేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.
Maha shivaratri: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవిశంకర్ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భీమవరం పంచారామ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఏలూరులోని పోలవరం మండలం పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. నది మధ్యలో నుంచి ఆలయానికి భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవలతో రహదారి ఏర్పాటు చేశారు.
TS News: ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..
అటు కైకలూరులో మహాశివరాత్రి సందర్భంగా కలిదిండి పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయ సమీపంలో ఉన్న పంచభూగ్గల కోనేరులో స్నానాలు ఆచరించి భక్తులు పితృ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
Maha shivaratri: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Mahashivratri 2024: కాశీ, నాసిక్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియో
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...