AP Politics: గెలుపు కోసం హోంమంత్రి ప్రలోభాల పర్వం.. ఇంతకీ ఏం చేశారంటే?
ABN , Publish Date - Mar 12 , 2024 | 02:14 PM
Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు. అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు. అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు, ప్లాస్కోల పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురి చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు.
ఏలూరు, మార్చి 12: జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోంమంత్రి తానేటి వనిత (Home Minister Taneti Vanitha) ప్రలోభాలు పర్వానికి తెరలేపారు. అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు. అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు, ప్లాస్కోల పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురి చేశారు. ద్వారకా తిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు. దేవస్థానం సమీపంలో నాన్ వెజ్ భోజనాలు పెట్టడంతో మంత్రి వ్యవహార శైలిపై భక్తులు మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే హోంమంత్రి ప్రలోభాలకు పాల్పడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగానే అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు గిఫ్ట్‌లిచ్చినా.. సంబంధిత ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad: ‘మహా’ ఆఫీస్ @ పైగా ప్యాలెస్
KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...