Home » Emerging Asia Cup
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్-ఏ జట్టు ఘోర పరాజయం పాలైంది. భారత్-ఏ పై పాకిస్థాన్-ఏ జట్టు 128 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్-ఏ ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ట్రోఫిని గెలుచుకుంది. కాగా పాకిస్థాన్-ఏ జట్టు వరుసగా రెండో సారి ఎమర్జింగ్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-ఏ ముందు పాకిస్థాన్-ఏ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తయ్యబ్ తాహిర్(108) సెంచరీతో ఊచకోత కోయడానికి తోడు సాహిబ్జాదా ఫర్హాన్(65), సైమ్ అయూబ్ (59) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 352/8 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ కుర్రాళ్లు తొలుత బ్యాటింగ్ చేయనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఓడిపోలేదు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను కూడా ఓడించింది. ఇప్పుడు ఫైనల్లో కూడా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా నిలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బౌలింగ్‌లో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ నిప్పులు చెరిగే బంతులకు తోడు, బ్యాటింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ (104) అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ పై భారత్ -ఏ ఘనవిజయం సాధించింది. ఏకంగా మరో 13 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఫీల్డర్లు గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌లు అందుకోవడం మనం అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ వంటి వాటిల్లో చూశాం. కానీ జూనియర్ క్రికెట్ లెవల్లో సైతం ఫీల్డింగ్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. సీనియర్లకు తామేమి తక్కువ కాదన్నట్టుగా తమదైన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్(5/42) దుమ్ములేపాడు. తన పేస్‌తో పాక్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి స్పిన్నర్ మానవ్ సుతార్(3/36) కూడా సహకరించడంతో పాకిస్థాన్-ఏ జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 206 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది.