Emerging Asia Cup: పాకిస్థాన్‌తో ఫైనల్.. టాస్ గెలిచిన టీమిండియా
ABN , First Publish Date - 2023-07-23T14:14:30+05:30 IST
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ కుర్రాళ్లు తొలుత బ్యాటింగ్ చేయనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఓడిపోలేదు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను కూడా ఓడించింది. ఇప్పుడు ఫైనల్లో కూడా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా నిలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్(Emerging Asia Cup)లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఫైనల్ (Final) మ్యాచ్‌లో దాయాదులు భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ కుర్రాళ్లు తొలుత బ్యాటింగ్ చేయనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఓడిపోలేదు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను కూడా ఓడించింది. ఇప్పుడు ఫైనల్లో కూడా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా నిలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Sunrisers Hyderabad: పెళ్లి చేసుకున్న మార్‌క్రమ్ మామ.. అత్త ఎలా ఉందో చూశారా?
ఈ టోర్నీలో భారత జట్టును యష్ ధూల్ తన నాయకత్వంతో ముందుండి నడిపిస్తున్నాడు. అతడితో పాటు సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారుు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్‌పై సాయి సుదర్శన్ సెంచరీతో రాణించడంతో అతడిపై మరోసారి అంచనాలు నెలకొన్నాయి. అటు తొలి మ్యాచ్‌లో యూఏఈపై శతక్కొట్టిన యష్ ధూల్ కూడా ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అభిషేక్ శర్మ కూడా తన వంతుగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో నిషాంత్ సంధు నాలుగు మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్‌పై రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ 5 వికెట్లతో రాణించి పాకిస్థాన్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. మరి ఈరోజు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు పాకిస్థాన్‌ను కట్టడి చేస్తారో లేదో వేచి చూడాలి.
భారత్ జట్టు: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధూల్, రియాన్ పరాగ్, నిషాంత్ సంధు, ధృవ్ జురెల్, మనవ్ సుతార్, యువరాజ్ దోడియా, హర్షిత్ రానా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్
పాకిస్థాన్ జట్టు: సైమ్ ఆయుబ్, సహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసఫ్, తాయబ్ తాహిర్, ఖాసిం అక్రమ్, మహ్మద్ హ్యారిస్, ముబాసిర్ ఖాన్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వాసిమ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్