Home » Enforcement Directorate
కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేయడానికి ముందు లిక్కర్ స్కామ్‌లో 9 సార్లు, ఢిల్లీ జల మండలిలో అవకతవకలపై ఒక సారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు. రాజకీయ కుట్రలో భాగంగా నోటీసులు జారీ చేశారని, తాను విచారణకు హాజరుకానని చెప్పారు. 142 రోజుల వ్యవధిలో ఈడీ 10 సార్లు సమన్లు జారీ చేసింది.
Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది.
ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
దిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..
దిల్లీ మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టు అవడంతో దేశ రాజధానిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దిల్లీ అసెంబ్లీ విడుదల చేసిన బులెటిన్‌లో సభను రద్దు చేయాలని స్పీకర్ ఆదేశించారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.