Share News

Delhi Liquor Scam: కవితకు మరో బిగ్ షాక్.. మళ్లీ ఈడీ సోదాలు!

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:39 AM

Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది.

Delhi Liquor Scam: కవితకు మరో బిగ్ షాక్..  మళ్లీ ఈడీ సోదాలు!

హైదరాబాద్, మార్చి 23: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ (ED).. కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం మాదాపూర్‌లోని అఖిల ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇది వరకే కవిత, ఆమె భర్తకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఈడీ.. ఆ లింకుల ఆధారంగానే ఇప్పుడు ఆమె ఆడపడుచు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

AP Elections 2024: వైసీపీ నేతల కోడ్ ఉల్లంఘన.. అడిగినందుకు ఎదురుదాడి..!


మరోవైపు... ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గత ఆరు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను ఈడీ విచారించింది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు సహా ఇతర ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటితో కవిత కస్టడీ ముగియనుంది. ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరనుంది. కాగా.. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీని బట్టి చూస్తే కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

MLC Kavitha: నేడు కోర్టుకు కవిత.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!

Telugudesam: కీలక నియోజకవర్గాల్లో చంద్రబాబు మార్పులు, చేర్పులు.. ఫైనల్‌గా గంటాకు..!!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 23 , 2024 | 09:46 AM