Home » Etela rajender
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి.
తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది..
అవును.. గత వారం, పదిరోజులుగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ప్రత్యేక కథనాలు అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్రం ఖరారు చేసింది..
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్తే.. స్వాగతిస్తానని తెలిపారు. ఈటలతో కలిసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం హస్తినకు చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించిన జితేందర్ రెడ్డి బండి సంజయ్ హస్తినకు వెళ్లగానే తమ పార్టీ నేతలతో తన ఫాంహౌస్‌లో బీజేపీ నేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు ఆదివార వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు.
తెలంగాణ బీజేపీలో (TS BJP) పెనుమార్పులు చోటుచేసుకునున్నాయా..? గులాబీ పార్టీని (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని వ్యూహాత్మకంగా కమలం పార్టీ అడుగులు వేస్తోందా..? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారా..?..
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (Etala Rajender) వై-ప్లస్ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం (TS GOVT) ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ బీజేపీకి (Telangana BJP) ఈటల అక్కర్లేదా..? రాజేందర్‌కు (Etela Rajender) బీజేపీ అవసరం లేదా..? అసలు ఆయన కమలం పార్టీలో ఉన్నారా..? లేదా..? కాషాయ పార్టీలో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ‘ప్రాణహాని ఉంది మహాప్రభో.. నన్ను కాపాడండి’ అని పదే పదే చెబుతున్నా..