TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

ABN , First Publish Date - 2023-07-01T23:35:35+05:30 IST

అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి.

TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి. అసలు బీజేపీలో ఉండరు.. అయితే సొంతగూటికి.. లేదా కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకుంటారని విమర్శించిన, ఆరోపించిన నేతల నోళ్లకు మూతపడ్డాయ్ అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒక్క ట్వీట్‌తో (Etela Tweet) కీలక పదవిపై ఈటల ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్ చూసిన వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటి..? ఎందుకింత చర్చనీయాంశం అవుతోంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Bandi-and-Etela-and-Kishan.jpg

ఇంతకీ ఏమిటా ట్వీట్..?

ఈటల కీలక పదవి రాబోతోంది.. ఈ వార్త గత నెలరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించింది. అస్సాం వెళ్లడం, వరుసగా ఢిల్లీకెళ్లి రోజుల తరబడి అక్కడే మకాం వేయడం.. ఆ మరుసటి రోజే కీలక ప్రకటన రాబోతోందని వార్తలు కూడా వచ్చాయి కానీ.. అదేమీ జరగలేదు. సీన్ కట్ చేస్తే రాజేందర్ తీవ్ర అసంతృప్తికి లోనవ్వడం.. కొన్నిరోజులపాటు మీడియా ముందుకు రాకపోవడం ఇవన్నీ జరిగాయి. ఆఖరికి ఇటీవలే ఢిల్లీకెళ్లొచ్చిన తర్వాత కూడా పదవిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. అయితే ఇప్పుడు ఈటల చేసిన ఒకే ఒక్క ట్వీట్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

‘భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు.. సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా గెలవాలని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనేక కష్ట, నష్టాలకోర్చారు. అవమానాలు భరించారు. త్యాగాలు చేశారు. పదవులు లేకపోయినా కాషాయ జెండాపట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది. మోదీ గారి నాయకత్వంలో బీజేపిని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికునిలా పనిచేస్తా. మీకు అండగా ఉంటా...’ అని ఈటల ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అంటే కీలక పదవి రాబోతోందని రాజేందరే స్వయంగా రివీల్ చేశారన్న మాట. ఇప్పుడీ ట్వీట్ అటు బీజేపీలో.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చనీయాంశం అవుతోంది.

WhatsApp Image 2023-07-01 at 11.04.24 PM.jpeg

ఈ ట్వీట్ వెనుక కథేంటో..?

ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెడతారని గత కొన్నిరోజులుగా వార్తలు రాగా అదేమీ జరగలేదు. సీన్ కట్ చేస్తే.. వారం రోజులుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలనే వరించబోతోందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ లేదని.. అంత పెద్ద పదవి వచ్చే ఛాన్సే లేదని వార్తలొచ్చాయి. అయితే బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు మూడ్రోజుల్లో ప్రకటన ఉంటుందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే కిషన్ రెడ్డి పదవి స్వీకరించడానికి సుముఖంగా లేరని.. అందుకే ఈటల వైపు అధిష్టానం మొగ్గు చూపిందట. ఎందుకంటే.. కేసీఆర్‌పై పోరులో ముందుండే వ్యక్తిగా, బీఆర్ఎస్ కిటుకులు తెలిసిన, ప్రజల్లోనూ మంచి గుర్తింపు, ఉద్యమాకారుడిగా పేరుపొందిన వ్యక్తి రాజేందర్‌. అందుకే తదుపరి ఆప్షన్ ఈటలేనని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఈటల ఆనందంతో ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ పదవిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో ఏంటో..!. అభిమానులు అనుకున్నట్లుగా కీలక పదవి.. అధ్యక్ష పదవేనా.. లేకుంటే మరొకటి ఏమైనా ఉందా..? అనేది తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడక తప్పదేమో..!

ఇవి కూడా చదవండి


TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?


AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!


Minister KTR : ఏంటిది సారూ.. టచ్ చేయకూడదా..? దండం పెట్టినా ఎందుకిలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!


Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!


Updated Date - 2023-07-04T16:37:36+05:30 IST