Etala: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం .. ఉత్తర్వులు జారీ

ABN , First Publish Date - 2023-06-30T20:46:10+05:30 IST

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (Etala Rajender) వై-ప్లస్‌ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం (TS GOVT) ఉత్తర్వులు జారీ చేసింది.

Etala: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..  ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్ (Etala Rajender), ఆయన సతీమణి జమున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (Etala Rajender) వై-ప్లస్‌ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం (TS GOVT) ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈటలకు వై-ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ముప్పు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన విషయం తెలిసిందే. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈటల వెల్లడించారు. ఈటల మీడియాకు వెల్లడించిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. స్వయంగా చొరవ తీసుకొని డీజీపీ‌కి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈటలను కలిసి వివరాలను సేకరించినట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. ఈటెల భద్రతపై సీల్డ్ కవర్లో డీజీపీకి రిపోర్ట్ అందజేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది.

Updated Date - 2023-06-30T20:59:35+05:30 IST