JitenderReddy: ఈటలతో విభేదాలపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-03T16:24:43+05:30 IST

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్తే.. స్వాగతిస్తానని తెలిపారు. ఈటలతో కలిసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని తెలిపారు.

JitenderReddy: ఈటలతో విభేదాలపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో (BJP MLA Etela Rajender) తనకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (BJP Leader Jitender Reddy) స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్తే.. స్వాగతిస్తానని తెలిపారు. ఈటలతో కలిసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని తెలిపారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుపు కోసం తాను కృషి చేశానని గుర్తుచేశారు. ఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే పార్టీ బలోపేతం కోసం మంచిదే అని అభిప్రాయపడ్డారు. ఈటల సహా... పార్టీ నేతలందరం కలుసుకుంటూనే ఉంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడి మార్పుపై తనకు సమాచారం లేదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో తాను లేనని... పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. 2004లో టీఆర్ఎస్‌తో బంధుత్వం ఎవరు పెట్టుకున్నారో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని హితవుపలికారు. బీజేపీపై రాహుల్ గాంధీ(Rahul gandhi) వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలో నలుగురు అభ్యర్థులు కూడా లేరని.. అలాగే నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరని తెలిపారు. పొంగులేటి చేరికతో... వాపును చూసి కాంగ్రెస్ బలుపు అనుకుంటోందని జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కాగా.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పెను దుమారాన్నే రేపారు. ఓ చిన్న వీడియో ద్వారా తెలంగాణ నాయకత్వంపై జితేందర్‌రెడ్డి తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై ఈటల ఫైర్ అయ్యారు. కాగా.. నేడు బండి సంజయ్ హస్తనకు వెళ్లగానే జితేందర్ రెడ్డి లంచ్ మీటింగ్ నిర్వహించడం దానికి ఈటల హాజరవడం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-07-03T16:41:39+05:30 IST