Home » Etela rajender
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ చేసింది తప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి తానేనని.. అందుకే తనను బయటకు గెంటేశారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) గుర్తు చేశారు.
బీజేపీతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. మంగళవారం మల్కాజిగిరికి చెందిన టీడీపీ నాయకులు, అడ్వకేట్ సుధీర్, ఫోరమ్ ఫర్ బెటర్ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు రాకేష్ తదితరులు ఈటల సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వనించారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.
మల్కాజ్గిరి అభివృద్ధి నా భాద్యత అంటూ ప్రజలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender) హామీనిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇస్తున్నారని, ఆగస్టులో తప్పకుండా రైతు రుణమాపీ చేస్తానంటూ నమ్మబలికిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నానని ఈటల రాజేందర్ అన్నారు.
Telangana: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఏకైక ఏజెండాతో పనిచేసిన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు అండ్ టీం..
గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..
దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రపంచ దేశాలన్నీ మోదీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.