Share News

Etala Rajender: పక్కాగా చెబుతున్నా.. మల్కాజిగిరి అభివృద్ధి బాధ్యత నాదే..

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:16 PM

మల్కాజ్‌గిరి అభివృద్ధి నా భాద్యత అంటూ ప్రజలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌(BJP candidate Etala Rajender) హామీనిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇస్తున్నారని, ఆగస్టులో తప్పకుండా రైతు రుణమాపీ చేస్తానంటూ నమ్మబలికిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నానని ఈటల రాజేందర్‌ అన్నారు.

Etala Rajender: పక్కాగా చెబుతున్నా.. మల్కాజిగిరి అభివృద్ధి బాధ్యత నాదే..

- ఆగస్టులో రైతు రుణమాఫీ సీఎం ఏ విధంగా చేస్తాడు?

- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నాను

- లిక్కర్‌పై వచ్చే ఆదాయం పాజిటివ్‌ ఇన్‌కం కాదు

- మల్కాజిగిరిలో గేటెడ్‌ కమ్యూనిటీ నిర్వాహకుల సమావేశంలో ఈటల

హైదరాబాద్: మల్కాజ్‌గిరి అభివృద్ధి నా భాద్యత అంటూ ప్రజలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌(BJP candidate Etala Rajender) హామీనిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇస్తున్నారని, ఆగస్టులో తప్పకుండా రైతు రుణమాపీ చేస్తానంటూ నమ్మబలికిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నానని ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మల్కాజిగిరి(Malkajigiri) వినాయక్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని బండచెరువు మార్నింగ్‌ వాకర్స్‌తో సమావేశం అనంతరం తరుణ ఎవెన్యూ గేటెడ్‌ కమ్యునిటీ నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. లిక్కర్‌ పై వచ్చే ఆదాయం పాజిటివ్‌ ఆదాయం కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్ల నిధులు కావాలని, ఆదాయం లేకుండా ఏ విధంగా హామీలు అమలు చేస్తారో ప్రజలే ఆలోచించాలని ఈటల రాజేందర్‌ అన్నారు. ఎలక్షన్‌ ఓరియంటెడ్‌ తప్ప పీపుల్స్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌ గురించి రేవంత్‌రెడ్డి ఆలోచన చేయడం లేదని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాజ్యలక్ష్మి, నాయకులు వికే మహేష్‌, తరుణ ఎన్‌క్లేవ్‌ గేటెడ్‌ కమ్యునిటీ ప్రతినిధి జయకుమార్‌లతో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు

అల్వాల్‌లో...: ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని వెంకటాపురం డివిజన్‌లో ఆయన నాయకుల, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలినించాలని ఈటల కోరారు. అంతకు ముందు ఆయన స్థానికుడైన తాటికొండ పట్టాభి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్‏కు హాజరై పలు విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్‌ కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, శేఖర్‌, రవికిరణ్‌, లక్ష్మణ్‌, మురళీ, మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సుజాత పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: కవితే కీలకం.. బెయిలివ్వొద్దు

Read More Crime News and Telugu News


Updated Date - Apr 23 , 2024 | 12:16 PM