JP Nadda: వికసిత్ భారత్ కోసమే ఈ ఎన్నికలు..
ABN , Publish Date - Apr 30 , 2024 | 10:10 AM
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.
- నిజాంపేట్ రోడ్‌షోలో జేపీ నడ్డా
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి భవ్యాస్ ఆనందం నుంచి అభయాంజనేయ దేవాలయం వరకు సాగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి వాసుల ఉత్సాహం చూస్తుంటే ఈటలను పార్లమెంటుకు పంపాలని నిర్ణయం తీసేసుకున్నట్టు అనిపిస్తోందన్నారు. బీజేపీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని, అది చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. దాడులు చేసిన వారిని బీజేపీ అంతమొందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపై జాలి చూపడం ఎంత వరకు సమంజసమన్నారు.
11వ స్థానం నుంచి 5కు
అగ్రదేశాలైన అమెరికా, యూరప్, రష్యా, జపాన్, చైనా, ఆస్ట్రేలియాల ఆర్థిక స్థితి సమస్యాత్మకంగా మారితే, మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరిందన్నారు. ఈసారి అధికారం ఇస్తే రెండేళ్లలో మూడో స్థానానికి తీసుకు వస్తామన్నారు. రిజర్వేషన్లపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. కర్ణాటకలో ముస్లిం సోదరులకు 4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
ఇదికూడా చదవండి: Khammam: బీజేపీ, బీఆర్‌ఎస్, అవినీతి పార్టీలు..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దిమ్మతిరగాలి: ఈటల
ఈటల రాజేందర్(Etala Rajender) మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి గడ్డ ఇచ్చే దెబ్బకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల దిమ్మ తిరిగిపోవాలన్నారు. ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేయాలని మోదీ ప్రయత్నిస్తుంటే, రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట బీఆర్‌ఎస్ నాయకుడు చక్రధర్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. రోడ్‌షోలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నిజాంపేట్ అధ్యక్షుడు ఆకుల సతీష్, బీజీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భ్రష్టు కూటమి
ఇండియా కూటమి.. భ్రష్టు రాజకీయ నాయకులతో కూడిన కూటమి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, స్టాలిన్ రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్, కేసీఆర్, కవిత, స్టాలిన్ వీరంతా అవినీతి రాజకీయ వాదులని ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, సంజయ్ సింగ్, చిదంబరం, కార్తీక్ చిదంబరం, లాలూయాదవ్ బెయిల్‌పై ఉన్నారని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అజంఖాన్, కవితతో పాటు పలువురు జైల్లో ఉన్నారని తెలిపారు. అలాంటి వారిని పార్లమెంటుకో, అసెంబ్లీకో పంపుతారా అని ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఎండలకు కేసీఆర్ ఆగమాగం అవుతున్నడు: జగ్గారెడ్డి
Read Latest AP News And Telugu News