Home » Farmers
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.
గిరిజన రైతులకు ఇవ్వాల్సిన విత్తన సబ్సిడీలకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) మంగళం పాడేసింది. చివరిగా 2016లో రాయితీ విత్తనాలు అందుకున్న రైతులకు ఎనిమిదేళ్లుగా ఐటీడీఏల సాయం అందడం లేదు.
తక్కువ జలాలతో అధిక ఫలసాయం అందించే సాగు పద్ధతులే ప్రపంచానికి ఆహారభద్రతను సమకూర్చగలవని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం బ్లాక్ రైస్, తృణధాన్యాల సాగుపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణలో వరితో పాటు ఇతర పంటల విత్తనాల ఉత్పత్తిని పెంచాలని, అందుకు అధికారులు కొత్త ఆలోచనలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
జగన్ ప్రభుత్వంలో అస్మదీయులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చడం ద్వారా రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడేలా తీసుకున్న ప్రధాన నిర్ణయాలపై పునఃసమీక్ష చేసేందుకు ఇంధన శాఖ సిద్ధమవుతోంది.
Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు..
రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని పదేళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవపట్టించడమేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు.
ఎరువుల అమ్మకం కచ్చితంగా ఈ- పాస్ ద్వారానే జరగాలని, అది కూడా కొనుగోలుదారు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.