Home » Flood Victims
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో 6 మంది మృతి చెందారు. 2 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 800 మందిని అధికారులు రక్షించారు.
రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.
భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షా లంటేనే ఆ ప్రాంత ప్రజలు భయాం దోళ చెందుతున్నారు. రెండేళ్ల కిందట తాము పడిన అవస్థలు వారింకా మ రువలేదు. ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో ఉమ్మడి అనంత జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంత కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.
నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.
ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.