AP Floods: సీఎం పిలుపు.. స్పందించిన మేఘా సంస్థ.. | MEIL Donates Food to Flood Victims in Vijayawada Andhra Pradesh Siva
Share News

AP Floods: సీఎం పిలుపు.. స్పందించిన మేఘా సంస్థ..

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:04 PM

విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..

AP Floods: సీఎం పిలుపు.. స్పందించిన మేఘా సంస్థ..
MEIAL Donates Food

అమరావతి, సెప్టెంబర్ 03: విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా మేఘా సంస్థ నిలిచింది. ఈ సహయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందిస్తోంది మెయిల్ సంస్థ. అక్షయ పాత్ర, ఎంఈఐఎల్ వంట శాలల్లో ఆహారం తయారు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తామని.. బాధితులను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మేఘా సంస్థ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి ప్రకటించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

దాతలూ ఇలా సంప్రదించండి..

వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు చేశారు. సాయం చేసే దాతలు ఐఏఎస్ మనజీర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నెంబర్ కూడా ప్రకటించింది. దాతలు 79067 96105 కు సంప్రదించొచ్చని తెలిపింది. ఇక వ్యక్తిగత ధన సహాయం చేయదల్చిన దాతలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది.


దాతలు ఈ అకౌంట్‌కు నిధులు పంపొచ్చు..

SBI

A/c name : CMRF

A/c number : 38588079208

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : SBIN0018884

Union Bank of India

A/c name : CM Relief Fund

A/c number : 110310100029039

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : UBIN0830798.


Also Read:

వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో..

వచ్చేవారం ఎన్నికల ప్రచారానికి మోదీ షురూ

లక్షలు ఖర్చు చేసి రొబోట్ కుక్కను తెచ్చాడు.. చివరకు..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 03 , 2024 | 10:04 PM