Share News

AP Floods: దటీజ్ చంద్రబాబు.. కనీసం భోజనం కూడా చేయకుండా..

ABN , Publish Date - Sep 03 , 2024 | 07:20 PM

కష్టాల్లో ఉన్నవారిని వదిలేయలేదు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా.. బురదైనా తడపడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కాన్వాయ్‌ని సైతం పక్కన పెట్టేసి.. నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.

AP Floods: దటీజ్ చంద్రబాబు.. కనీసం భోజనం కూడా చేయకుండా..
Andhra Pradesh

అమరావతి, సెప్టెంబర్ 3: కష్టాల్లో ఉన్నవారిని వదిలేయలేదు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా.. బురదైనా తడపడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కాన్వాయ్‌ని సైతం పక్కన పెట్టేసి.. నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. భారీ వర్షాల నేపథ్యంలో ఉప్పొంగిన వరదలకు విజయవాడ విలవిల్లాడిపోయింది. వరదల్లో చిక్కుకుని విజయవాడ సహా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూడు, గూడు, గుడ్డ.. సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. బాధిత ప్రజలు అధైర్య పడొద్దని ఆసరాగా నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కంటిమీద కునుకులేకుండా.. భోజనం కూడా చేయకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో కలియతిరుగుతూ వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు.


విజయవాడ పరిధిలో నాలుగు గంటలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పర్యటించారు సీఎం. నాలుగు గంటలుగా కాన్వాయ్‌ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరుగుతోంది. సితార సెంటర్ నుంచి ఇతర ప్రాంతాల మీదుగా బైపాస్‌కు వెళ్లింది కాన్వాయ్. ముఖ్యమంత్రిని ఎక్కించుకునేందుకు రామవరప్పాడు మీదుగా కాన్వాయ్ వెళ్లింది.


వరద బాధితులకు సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద నీటిలోనే నడుచుకుంటూ బాధితుల వద్దకు వెళ్తున్నారు. వారిని పరామర్శించి అండగా ఉంటామని.. అధైర్యం పడొద్దని భరోసా ఇస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆహారం అందుతుందా? లేదా? అని స్వయంగా చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై సీఎం ఆరా తీశారు. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టు పాయింట్ ఛేంజ్ అవుతూ మారుతున్న సీఎం కాన్వాయ్.


Also Read:

ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ అతడే..

గాలి జనార్ధన్ రెడ్డికి షాక్

బిభవ్‌కు బెయిలు: స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 03 , 2024 | 07:20 PM