Home » G. Kishan Reddy
ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh) సమక్షంలో సినీ నటి జయసుధ (actress Jayasudha) బీజేపీలో చేశారు.
ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ బీజేపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏడాది నుంచి శాసనసభలో ఖాళీగా ఉన్న ఫ్లోర్ లీడర్ పదవిని ఇప్పటి వరకూ కమలనాథులు భర్తీ చేయలేదు. దీంతో ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఆ పార్టీలో ఉత్కంఠ సాగుతోంది.
బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
కిషన్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖుల్లో అతి ముఖ్యమైన నేత. యువ మోర్చాలో కోశాధికారిగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు జన హృదయ నేతగా గుర్తింపు ఉంది.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం తీవ్ర కలకలం రేపింది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని, కానీ 8 శాతం కూడా హైదరాబాద్ (Hyderabad) బాగు కోసం కేటాయించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వక కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసినా కూడా హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా బీజేపీ నాయకురాలు విజయశాంతి వరుస ట్వీట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయశాంతి వ్యవహారం వాత పెట్టి.. వెన్న పూసిన మాదిరిగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించే విజయశాంతి ట్వీట్స్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పందించారు.