Kishan Reddy: అవిశ్వాస తీర్మానంపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..
ABN , First Publish Date - 2023-07-26T13:25:36+05:30 IST
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై (Modi Government) కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Congress MP Gaurav Gogoi) సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan reddy) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) ఒక్కటేనని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానంతో ఒరిగేది ఏమీలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని తెలిపారు. బీజేపీ మాత్రమే బీఆర్ఎస్‌తో పోరాటం చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు అవినీతి, కుటుంబ పార్టీలే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా మూడు పార్టీలు అనేక సార్లు తెలంగాణను పరిపాలించాయన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) బుధవారం ఆమోదం తెలిపారు. దీనిపై చర్చకు తేదీని ఖరారు చేసేందుకు అన్ని పార్టీల నేతలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా... 26 పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A)లో లేని పార్టీ బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.