Home » Ganta Srinivasa Rao
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.
విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. నిన్న జగన్ భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.
విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.
విజయవాడ ఎసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ అధికారులు గురువారం ఛార్జీ షీటు దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె. అచ్చెన్నాయుడు, గంటా సుబ్బా రావు, డాక్టర్ కే.లక్ష్మీనారాయణ తదితరుల పాత్ర ఉన్నట్లు అధికారులు ఛార్జీ షీట్లో పొందు పరిచారు.
పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
TDP MLA Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. ఇందుకోసం అభ్యర్థులను మార్చడంలో కూడా టీడీపీ అధినేత వెనకాడట్లేదు. సర్వేలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మళ్లీ కసరత్తులు చేసి.. మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్‌లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?