Share News

MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:03 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో ఇళ్ల(Tidco Houses)ను ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన పీఎం పాలెం(PM Palem) టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు.

MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖ: వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో ఇళ్ల(Tidco Houses)ను ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన పీఎం పాలెం(PM Palem) టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించామని, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అన్యాయం చేశారని, ఇళ్ల లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం వారిపట్ల దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడంతో లబ్ధిదారులకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే గంటా అన్నారు. అధికారులతో కలిసి టిడ్కో ఇళ్లు సందర్శించినట్లు.. త్వరలోనే దీనిపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హౌసింగ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గంటా చెప్పుకొచ్చారు. 6నెలల్లో ఇళ్లు పూర్తి చేసి అందజేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.


గత వైసీపీ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులకు కాకుండా వేరే వాళ్లకు పీఎం పాలెంలో టిడ్కో గృహాలు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, ఎవరైతే అన్యాయంగా వచ్చారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. జగన్ హయాంలో రాష్ట్రం పూర్తిగా గాడి తప్పిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హమీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే టిడ్కో ఇళ్ల విషయంలోనూ లబ్ధిదారులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

Chandrababu: అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Updated Date - Jun 20 , 2024 | 03:03 PM