Share News

Ganta Srinivasa Ra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు..

ABN , Publish Date - Jul 17 , 2024 | 07:03 PM

పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు.

Ganta Srinivasa Ra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు..
Ganta Srinivasa Rao

విశాఖపట్నం: పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు. గతంలో చిన్న చిన్న వ్యాన్లలో, మినీ ఆటోల్లో మట్టి తీసుకుపోతుండేవారు. ఇప్పుడు ఏకంగా జేసీబీలతోనే తవ్వకాలు చేపట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎర్రమట్టి దిబ్బలు సుమారు 1,195 ఎకరాల్లో విస్తరించి ఉండగా, వీటిలో 292 ఎకరాలను జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ALSO Read: YS Sharmila: ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్‌లు

భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను ఈరోజు(బుధవారం) పరిశీలించారు. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెబుతున్నారని.. తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేల్చిచెప్పారు.


గత ఆరు నెలల నుంచి తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ విషయంపైన కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేయాలని కోరామని అన్నారు. అసలు ఎర్రమట్టి దిబ్బకు సంబంధించి ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా వేస్తామని.. వాటి పరిధిని కచ్చితంగా నిర్ణయిస్తామని ప్రకటించారు. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Kodali Nani :వెలుగులోకి కొడాలి నాని ఆక్రమాలు..

Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన

Nitin Gadkari: ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి సమీక్ష..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 07:30 PM