Home » Gautam Gambhir
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.
గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.
గౌతం గంభీర్. ఈ పేరు గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ఆటతోనే కాకుండా వివాదాలతోనూ చాలా ఫేమస్ అయ్యాడు. ముక్కుసూటి తనంతో వ్యవహరించే గంభీర్ ఎలాంటి విషయం గురించి అయినా సరే నేరుగా మాట్లాడతాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిత్యం బద్ద శత్రువులుగా కనిపించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ వేదికగా ఒకటయ్యారు.
సాధారణంగా.. మన భారత రాజకీయాల్లో (Indian Politics) సిట్టింగ్ ఎంపీలు పోటీ నుంచి తప్పించుకోవడం అనేది చాలా అరుదు. అందునా.. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, తమకు మరోసారి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పడం దాదాపు అసాధ్యం. అలాంటిది.. బీజేపీకి (BJP) చెందిన ఇద్దరు ఎంపీలు గంటల వ్యవధిలోనే తాము లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, ఆ పనుల నుంచి తమని తప్పించాలని కోరామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని హజారిబాగ్ ఎంపీ జయంత్ సిన్హా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న తర్వాత వాతావరణ మార్పులపై దృష్టిసారిస్తానని సోషల్ మీడియా ఎక్స్‌లో జయంత్ సిన్హా ట్వీట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.
గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.