Share News

IPL 2024: బాల్ కంపెనీ మార్చండయ్యా..? కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:45 PM

ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్‌లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.

IPL 2024: బాల్ కంపెనీ మార్చండయ్యా..? కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్
Change Ball Manufacturer KKR Mentor Gautam Gambhir Asked, High-Run Scoring Fixtures In IPL 2024

ఐపీఎల్ (IPL) సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్‌లో భారీ స్కోరు నమోదవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్, బాల్ ప్రాతినిథ్యం సమానంగా ఉండాలని అభిప్రాయ పడ్డారు.

IPL 2024: రూ.25 కోట్లు వేస్ట్.. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు.. అతడి సమాధానం ఏంటంటే..


వైట్ బాల్ మార్చండి..?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో వాడుతున్న బాల్ కంపెనీ మార్చాలని గంభీర్ సూచన చేశారు. కంపెనీ మారిస్తే బౌలర్లకు కాస్త ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయ పడ్డారు. బాల్ కంపెనీకి సంబంధించి కొన్ని విషయాలను ఉదహరించారు. ఉత్పత్తి దారు అందజేసే బాల్ 50 ఓవర్ల పాటు పనిచేయాలి. లేదంటే ఆ బాల్ కంపెనీని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. తయారీదారుని మార్చడంలో తప్పు లేదని వివరించారు.

Sunil Narine: సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి


హర్ష భోగ్లే కూడా

గంభీర్ వాదనతో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే ఏకీభవించారు. ప్రస్తుతం వాడే స్థానంలో డ్యూక్ బాల్ ఉపయోగించొచ్చని సూచించారు. బ్యాట్‌తో బాల్ పోటీ పెరిగి ఆటలో సమతుల్యత ఉండే అవకాశం ఉందని వివరించారు. పిచ్ సహకరించని పరిస్థితిలో డ్యూక్ బాల్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. బ్యాట్స్ మెన్ బంతిని ఇష్టానుసారం కొట్టే వీలుండదని పేర్కొన్నారు.

IPL 2024: ఈసారి టైటిల్ ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 04:45 PM