BJP: గంభీర్ బాటలో ఎంపీ జయంత్ సిన్హా.. ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రిక్వెస్ట్
ABN , Publish Date - Mar 02 , 2024 | 05:18 PM
లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని హజారిబాగ్ ఎంపీ జయంత్ సిన్హా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న తర్వాత వాతావరణ మార్పులపై దృష్టిసారిస్తానని సోషల్ మీడియా ఎక్స్‌లో జయంత్ సిన్హా ట్వీట్ చేశారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రూపొందించడంలో భారతీయ జనతా పార్టీ (BJP) ముఖ్య నేతలు తీరిక లేకుండా ఉన్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు తాము లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొనబోం, ఆ పనుల నుంచి తమను తప్పించాలని కోరుతున్నారు. శనివారం ఉదయం బీజేపీ నేత గౌతమ్ గంభీర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను (Amith Shah) ఇదే విషయం కోరారు. అదే బాటలో హజారిబాగ్ ఎంపీ జయంత్ సిన్హా నడిచారు. లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని జయంత్ సిన్హా అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై.. ఎందుకంటే..?
‘లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తప్పించండి. ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న తర్వాత వాతావరణ మార్పులపై దృష్టిసారిస్తా. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వాతావరణ మార్పులపై ఫోకస్ చేస్తా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆర్థిక, పాలనపర సమస్యలపై మాత్రం పనిచేస్తాను. గత పదేళ్ల నుంచి హజారిబాగ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు కలిగింది. ప్రధాని మోదీ మంచి అవకాశం కల్పించారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ నాయకత్వం తనను ప్రోత్సహించింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని’ జయంత్ సిన్హా ట్వీట్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.