Home » GoldSilver Prices Today
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది.
శ్రావణ మాసం శుభ కార్యాలకు నెలవు. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తారు. అలాగే ఎక్కడ శుభకార్యం జరిగినా.. గుళ్లు గోపురాలకు వెళ్లినా.. ఒంటి నిండా బంగారు నగలు ధరించి వెళ్లతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళలు.. మహారాణులు లాగా దర్శనమిస్తారు.
ఏడాదిలో అత్యంత శుభ్రప్రదమైన మాసాల్లో శావ్రణ మాసం ఒకటి. శుభకార్యాలకు నెలవైన ఆ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో పూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లు కళకళలాడతాయి. దాంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. అదీకాక ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో నాటి నుంచి వీటి కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 5 వేల రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గోల్డ్ రేటు తగ్గిందని కొనుగోలు చేసేందుకు షాపుల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం నిన్నటితో పోల్చుకుంటే 24 గ్రాముల పసిడి రేటు 10 గ్రాములకు 1,190 రూపాయలు తగ్గింది.
దేశంలో బడ్జెట్ 2024లో పుత్తడి(gold), వెండి(silver) ధరలపై కస్టమ్స్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల్లోనే దాదాపు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 5 వేల రూపాయలకుపైగా తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు(జులై 25న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,090గా కలదు.
దేశంలో సాధారణ బడ్జెట్ 2024 సమర్పణ వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి రూ. 67,600కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,730కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 22న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 67,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,110గా ఉంది.
దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది.