Gold and Silver Rates Today: రూ.7 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..
ABN , Publish Date - Jul 28 , 2024 | 06:39 AM
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 5 వేల రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 5 వేల రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు(జులై 28న) హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 69,900గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 63,250గా ఉంది. ఇక వారం రోజుల క్రితం జులై 21న ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది. ఈ క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో రూ.4,970 తగ్గగా, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.4,550 తగ్గింది.
మరోవైపు గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 7 వేల రూపాయలు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు కేజీ వెండి ధర ఢిల్లీలో రూ.84,500 ఉండగా, జులై 21న ఇదే చోట రూ.91,500గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో అనేక మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇందుకే తగ్గుతున్నాయా
భారతదేశంలో ఎందుకు బంగారం ధరలు తగ్గాయంటే బడ్జెట్ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6%కి తగ్గించినట్లు ప్రకటించారు. ఆ క్రమంలో జులై 23 నుంచి దేశంలో బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. మరోవైపు పసుపు లోహానికి తక్కువ డిమాండ్ కూడా చైనాలో భౌతిక బంగారానికి భారీ నష్టం కలిగించిందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో US ద్రవ్యోల్బణం డేటా వెలువడిన తర్వాత బంగారం ధరలు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధోరణులు, దేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఈ బంగారం స్వచ్ఛమైనది
మీరు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దానిని ఇలా గుర్తించాల్సి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ అంటే 24K స్వచ్ఛమైన బంగారంగా పరిగణించబడుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు 18-22K బంగారాన్ని అందులో ఉపయోగిస్తారు. దీంతో పాటు అందులో ఇతర లోహాలు కూడా కలుస్తాయి.
స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి, మీరు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను తీసుకోవాలి. ఆభరణాలకు హాల్‌మార్క్ లేకపోతే బంగారం కొనకూడదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశంలో హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన లోహాలకు ధృవీకరణ ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని నాణేలు, కడ్డీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అత్యధిక స్వచ్ఛతను కలిగి ఉంటాయి. 999 స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం 99.90 శాతం స్వచ్ఛమైనది. ఇతర లోహాలు 0.10 శాతం.
ఇవి కూడా చదవండి:
Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?
Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Read More Business News and Latest Telugu News