Share News

Gold and Silver Rates: బంగారం, వెండి కొంటున్నారా.. ఈరోజు ధరలు తెలుసుకోండి..

ABN , Publish Date - Jul 27 , 2024 | 07:03 AM

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Gold and Silver Rates: బంగారం, వెండి కొంటున్నారా.. ఈరోజు ధరలు తెలుసుకోండి..
Gold and Silver Rates

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (27 జులై 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.

Jobs: వచ్చే 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు.. లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడి అంచనా


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే జులై 26 శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.6,299గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.62,990గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 6,872గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.68,720గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

టెక్‌ మహీంద్రా లాభంలో 23% వృద్ధి


వివిధ నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి శుక్రవారంతో పోలిస్తే శనివారం గ్రాముకు రూపాయి తగ్గింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,314గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.63,140గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.6,887గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.68,870గా ఉంది.


దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,299గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.62,990గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.6,872గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.68,720గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,414గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.64,140గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.6,997కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.69,970గా ఉంది.

New Tax Regime: కొత్త పన్ను విధానాన్ని ఎలా ఎంచుకోవాలి.. అందుకోసం ఏం చేయాలంటే..


దేశంలో వెండి ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు చూస్తే.. శుక్రవారంతో పోలిస్తే శనివారం స్వల్పంగా ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.88,9000గా ఉంది.


Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.


RBI : అర్బన్‌ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 01:55 PM