Home » GoldSilver Prices Today
భారత్లో బంగారం(gold) ధరలు(rates) క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నేడు(ఏప్రిల్ 9న) కూడా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో బంగారం ధర రూ.71,000 పైకి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.71,620 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.71,730కి చేరింది.
గత కొన్నిరోజుల నుంచి బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్.. పండగలు రావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దేశంలో రోజురోజుకు పుత్తడి(gold) రేట్లు పైపైకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 రోజుల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,500 ఉండగా, ఇప్పుడు రూ.71,290కి చేరింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నెల రోజుల క్రితం రూ.61,870 ఉండగా, ప్రస్తుతం రూ.65,350కి ఎగబాకింది.
వరసగా పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలు ఉండటంతో బంగారం ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరువ కానుంది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది.
మార్చి 30, 2024న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్పల్ప మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే బంగారం ధర 100 గ్రాములకు 100 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.68,740 ఉండగా, ఇది నిన్న రూ.68,730గా ఉంది.
బంగారం ధరలు వరసగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల ధర రూ.550 మేర తగ్గింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గింది. రూ.61,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.66,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం, 24 బంగారం ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.59,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.64,960గా ఉంది.
దేశంలో గోల్డ్ రేట్లు(Gold rates) క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి రేట్లు పెరిగాయి. వారం రోజుల క్రితం 10 గ్రాముల గోల్డ్ ధర 60 వేల దిగువన ఉండగా.. ప్రస్తుతం 60 వేల 200లకుపైగా పసిడి ధరలు కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది.