Technology : హెల్త్ కనెక్ట్ ఉపయోగించుకోండి ఇలా
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:48 AM
గూగుల్ హెల్త్ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్ ఫిట్నెస్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్ అందుకు పరిష్కారంగా గూగుల్ హెల్త్ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది.
గూగుల్ హెల్త్ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్ ఫిట్నెస్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్ అందుకు పరిష్కారంగా గూగుల్ హెల్త్ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది. శాంసంగ్‌తో కలిసి ఈ పని చేపట్టింది. ఇది వివిధ ప్లాట్‌ఫారాల్లో ఉన్న సమాచారాన్ని క్రోఢీకరిస్తుంది. అవసరమైన డేటా ఇస్తుంది. వివిధ డివైజ్‌లు, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సానుకూలతను కుదురుస్తుంది.
ప్రస్తుతానికి ఇది బేటా దశలో ఉంది. గత ఏడాది మార్చిలో చోటుచేసుకున్న పిక్సెల్ అప్డేట్తో ఇది ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా మారింది. ఆండ్రాయిడ్ 14తో ఇంటిగ్రేట్ అయింది. మొదట్లో ఇది కొన్నింటితోనే అనుసంధానమైంది. ఫిట్‌బిట్, శాంసంగ్ హెల్త్, గూగుల్ ఫిట్, మైఫిట్నెస్పాల్ వంటి వాటితో కలిసింది. ఆ క్రమంలో హెల్త్ ట్రాకింగ్ మేట్రిక్స్, డేటా టైప్స్, న్యూట్రిషన్ అలాగే నిద్రకు సంబంధించిన కార్యకలాపాలపై కీలక సమాచారం తదితరాలను కలిపింది.
ఈసీజీ వంటి వాటిని సపోర్ట్ చేయడం లేదు. వివిధ డివైజ్‌లను ఉపయోగించే యూజర్లకు ఇది అనువుగా ఉంటుంది. సమాచారాన్ని ఒక గొడుగు కిందకు తెచ్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. పిక్సెల్ యూజర్లు దీన్ని చాలా సులువుగా, సూటిగా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో యాప్స్ అక్కడి నుంచి హెల్త్ కనెక్ట్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. నాన్ పిక్సెల్ యూజర్లు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డైన్లోడ్ చేసుకోవాలి. అక్కడ కూడా దీన్ని ఎనేబుల్ చేసుకోవడం సులువే.