TS Assembly: ఆ ఒక్క కవితతో బీఆర్‌ఎస్ పాలనను తేల్చేసిన గవర్నర్...!
ABN , Publish Date - Feb 08 , 2024 | 12:30 PM
Telangana: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలో పొందుపరిచిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly) గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలో పొందుపరిచిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు.
‘‘ అధికారమున్నదని హద్దు పద్దు లేక.
అన్యాయమార్గాల నార్జింపబూనిన .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి!’’ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
కేసీఆర్ డుమ్మా...
కాగా... గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్పీచ్‌లో గత బీఆర్ఎస్ పాలనపై ఘాటైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరి నేటి గవర్నర్ స్పీచ్‌పై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. అయితే రేపు (శుక్రవారం) ధన్యవాద తీర్మానం చేయడానికి ఆయన హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...