PM Modi: తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన.. రేవంత్ వీడ్కోలు
ABN , Publish Date - Mar 05 , 2024 | 02:46 PM
Telangana: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండు రోజుల పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళసై (Governor Tamilisai), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
TS News: మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ
నిన్న (సోమవారం) ఆదిలాబాద్‌లో పర్యటించిన మోదీ.. రూ.6 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అంబారీ - ఆదిలాబాద్ - పింపాలకుట్టీ రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ రెండో థర్మల్ పవర్ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఈరోజు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన ప్రధాని పటాన్‌చెరులోని పటేల్ గూడ చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. అనంతరం సంగారెడ్డిని బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఒరిస్సాకు ప్రధాని మోదీ పయనమయ్యారు.
AP News: ఎంపీ భరత్‌కు టీడీపీ, జనసేన కౌంటర్
మోదీని పెద్దన్న అన్న రేవంత్.. బీఆర్‌ఎస్ విమర్శలు
కాగా... ప్రధాని మోదీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండగా... ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పాత ఆనవాయితీని కొనసాగించారు. నిన్న ఆదిలాబాద్‌లో ప్రధానిని పెద్దన్నయ్యగా సీఎం సంబోధించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ అటాక్‌కు దిగింది.
ఇవి కూడా చదవండి...
PM Modi: మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా?.. ప్రధాని ఫైర్
Satya Kumar: గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే కేసులు హత్యలా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...