Home » Gujarat
యజమాని ఆదేశాల ప్రకారం ఓ పాత కాలం నాటి ఇంటిని కూల్చి వేస్తుండగా కూలీలకు 240 బంగారు నాణేలు లభించాయి. వాటిని కూలీలు తమ ఇంట్లో దాచుకున్నారు. కానీ పోలీసులు వచ్చి వాటిని తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన పోలీసులు ప్రభుత్వానికి అప్పచెప్పకుండా తమ జేములో వేసుకున్నారు.
భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలో గ్యాస్ సిలిండర్లు సైతం కొట్టుకుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణ గుజరాత్‌లోని నవసారిలో గల ఓ గ్యాస్ గౌడౌన్లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 14.8 కిలో గ్రాముల బరువు ఉండే గ్యాస్ సిలిండర్లు సైతం వరద నీటిలో ఒక బంతిలా సునాయసంగా కొట్టుకుపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన అపీలుపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ‘‘దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది?’’ అని ప్రశ్నించడం నేరమేనని సూరత్ కోర్టు నిర్ధరించి, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో మంగళవారం కాస్త శుభవార్త వినిపించింది. ‘ఇంటి పేరు మోదీ’ కేసులో తనకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అపీలును విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
తండ్రి ఫోనుతో ఆడుకుంటున్న ఓ బాలికకు తండ్రి అసభ్యకరమైన ఫోటో ఒకటి కనిపించింది. దీంతో ఆమె దీన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. భర్త ఎఫైర్ గురించి తెలుసుకున్న ఆమె భర్తతో గొడవకు దిగింది. ఈ క్రమంలో అతడు కూతురిపై చేయి చేసుకున్నాడు. దీంతో, బాలిక తల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసిందీ ఘటన.
సాధారణంగా మనం వీధుల్లో భార్య భర్తలు కొట్టుకోవడం చూశాం. అలాగే ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకోవడం కూడా చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. అది కూడా మాములుగా కాదు. జుట్లు పట్టుకోని కసి తీర కొట్టుకుంటున్నారు.
‘మోదీ ఇంటిపేరు’ (Modi surname) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) రివ్యూ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మోదీ ఇంటిపేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)కి గుజరాత్ హైకోర్టులో ఊరట లభించలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత దారుణంగా చంపేశాడు. జూన్ 27న బాలిక అదృశ్యంపై కేసు నమోదవగా తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళలు నిత్యం ఇంటా, బయటా అనే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఇంట్లో భర్త చిత్రహింసలతో అవస్థలు పడుతుంటే.. మరికొందరు బయట ఆకతాయిల వేధింపులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు...