Viral Video: ఆ బూతులేంటో.. ఇలా రోడ్డునపడి ఫైటింగ్‌లేంటో.. ఈ ఇద్దరమ్మాయిల వీడియో చూడండి..!

ABN , First Publish Date - 2023-07-10T17:55:49+05:30 IST

సాధారణంగా మనం వీధుల్లో భార్య భర్తలు కొట్టుకోవడం చూశాం. అలాగే ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకోవడం కూడా చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. అది కూడా మాములుగా కాదు. జుట్లు పట్టుకోని కసి తీర కొట్టుకుంటున్నారు.

Viral Video: ఆ బూతులేంటో.. ఇలా రోడ్డునపడి ఫైటింగ్‌లేంటో.. ఈ ఇద్దరమ్మాయిల వీడియో చూడండి..!

సాధారణంగా మనం వీధుల్లో భార్య భర్తలు కొట్టుకోవడం చూశాం. అలాగే ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకోవడం కూడా చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. అది కూడా మాములుగా కాదు. జుట్లు పట్టుకోని కసి తీర కొట్టుకుంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటున్నాయి వారి ఫైట్స్. ఆపకుంటే ఒకరిని ఒకరు చంపేసుకుంటారేమో అనే స్థాయిలో అమ్మాయిల ఫైటింగ్స్ ఉంటున్నాయి. ఇలాంటి వీడియోలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటిదే మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


44 సెకన్ల వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం బాయ్‌ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై ఇద్దరు అమ్మాయిలు కసితీరా కొట్టుకుంటున్నారు. అవసరమైతే ఒకరినొకరు చంపుకోవడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. దీంతో అక్కడ చాలా మంది గుమిగూడారు. కానీ ఎవరూ ఆపే సాహసం చేయలేకపోతున్నారు. అయితే ఒక యువకుడు మాత్రం ఆమ్మాయిల ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సదరు అమ్మాయిలు ఏ మాత్రం తగ్గడం లేదు. గుజరాతీ భాషలో బండ బూతులు తిట్టుకుంటూ కిక్ బాక్సింగ్ రేంజులో కొట్టుకుంటున్నారు. బహుషా ఆపడానికి ప్రయత్నింటిన ఆ యువకుడే వారి బాయ్ ‌ఫ్రెండ్ కావొచ్చు. ఇంతలో అక్కడికి వచ్చిన మరొక అమ్మాయి ఆ యువకుడిని ఇష్టమొచ్చినట్టుగా కొడుతుంది. ఆ ఇద్దరి అమ్మాయిల్లో ఒక అమ్మాయి మరొక అమ్మాయిని ఫోన్ అడిగితే ఇవ్వలేదట. అదే ఇంత పెద్ద గొడవకు కారణంగా తెలుస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - 2023-07-10T17:57:51+05:30 IST